VSP: సమస్యల పరిష్కారం కోసమే మహానాడు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నెల 27 నుంచి కడప జిల్లాలో జరగనున్న మహానాడుకు ముందు, విశాఖ దక్షిణ నియోజకవర్గ మినీ మహానాడు మంగళవారం ఘనంగా జరిగింది. నియోజకవర్గం ఇంఛార్జ్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామన్నారు.