JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున గుప్తనిధుల కోసం ముగ్గురు వ్యక్తులు తవ్వకాలుచేపట్టడం కలకలం రేపింది. పట్టణంలోని గంజ్ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.