TPT: టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారి K.V. మురళీకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం విశాఖ 16వ బెటాలియన్ ఎస్పీగా ఉన్న మురళీకృష్ణ బదిలీపై ఇక్కడికి రానున్నారు. కాగా.. ప్రస్తుతం ఈ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును రిలీవ్ చేశారు.