ASR: భూముల రీసర్వే ప్రక్రియ జూలై 15వ తేదీలోగా పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను జాయింట్ కలెక్టర్ అభిషేక్ మంగళవారం ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. గ్రామసభలు నిర్వహించిన తర్వాత అందిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.