MDK: అదృశ్యమైన మహిళ మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. నిజాంపేట మండలం రజాక్పల్లికి చెందిన బాల మల్లవ్వ (45) మార్చి 13న చిన్నశంకరంపేట మండలం సూరారం బాగిర్తిపల్లిలోని తమ బంధువుల వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి అదృశ్యమైంది. ప్రస్తుతం ఆమె మృతదేహం అటవీ ప్రాంతంలో లభ్యమైంది.