HNK: వరంగల్ జిల్లా కేంద్రానికి విమానాశ్రయాన్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కృతజ్ఞతలు తెలిపారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో నేడు ఆమె మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా ప్రజలకు కానుక అందించిన పిఎం నరేంద్ర మోదీతోపాటు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డిలకు రుణపడి ఉంటామని తెలిపారు.