ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్కను ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు ఆధ్వర్యంలో తుడుందెబ్బ నాయకులు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మావల మండలం కొమరం భీం కాలనీలో మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కో-కన్వీనర్ గణేష్, రేణుక, మనోజ్ తదితరులున్నారు.