ADB: బేలా మండలంలోని గూడా గ్రామంలో NCFE ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్‌కు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. డిజిటల్ లావాదేవీలు, ఆధార్ OTP గోప్యత, సైబర్ క్రైమ్స్, డిజిటల్ ఆరెస్ట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని CFL సిబ్బంది అనికేత్, వినోద్, అజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అవినాష్, ఉప సర్పంచ్ నిఖిల్, గ్రామ వృద్ధులు పాల్గొన్నారు.
VKB: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ, పరిగి వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు యథావిధిగా కొనసాగాయి. సాధారణంగా సెలవు రోజుల్లో మార్కెట్ బంద్ చేయాల్సి ఉన్నా, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
RR: వివిధ కేసుల్లో పట్టుబడిన 7 వాహనాలకు ఇవాళ వేలం నిర్వహించనున్నట్లు సరూర్ నగర్ ఎక్సైజ్ సీఐ ఎన్. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆర్కేపురం సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని, మరిన్ని వివరాలకు 8712658746 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
KMM: కూసుమంచి తహసీల్దార్ రవికుమార్‌ను ముదిగొండ తహసీల్దార్ కార్యాలయానికి డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ డి. సైదులు కూసుమంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ బదిలీలతో పాటు, ఖమ్మం జిల్లాలో మొత్తం 10 మంది తహసీల్దార్‌ను డిప్యూటేషన్ పై బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
HYD: ప్రైవేటు ట్యాంకర్లు జలమండలి లోగోను వినియోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎండీ అశోక్ రెడ్డి అన్నారు. జలమండలి పేరు, లోగో, బ్రాండ్‌ను ఉపయోగిస్తూ ప్రైవేట్ బోర్ వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు అనధికారికంగా ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. జలమండలి లోగో ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నమని, దీనిని అనుమతి లేకుండా వినియోగించవద్దన్నారు.
WNP: ఎల్లూరు పంపు హౌస్లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మేఘనాథ్ గౌడ్ తెలిపారు. గణేష్ నగర్, సాయి నగర్, ఆర్టీసీ కాలనీ సహా 15కు పైగా ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.
WNP: ఎల్లూరు పంపు హౌస్లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మేఘనాథ్ గౌడ్ తెలిపారు. గణేష్ నగర్, సాయి నగర్, ఆర్టీసీ కాలనీ సహా 15కు పైగా ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి, నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.
SRPT: ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్న కందిమల్ల సాయి శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లాలోని నడిగూడెం మండలం శ్రీరంగాపురానికి చెందిన సాయి(20) గురునానక్ కాలేజీలో ECE 2nd ఇయర్ చదువుతున్నాడు.
HYD: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో HYD శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విమానాల రాకపోకల్లో మార్పులు ఉండే అవకాశం ఉండటంతో ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్ www.hyderabad.aero ద్వారా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. బయలుదేరే ముందు +91 4066546370 నంబర్‌కు కాల్ చేసి,రావాలని తెలిపారు.
NLG: శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పచ్చని తోరణాలతో శోభాయమానంగా ఆలయాలను అలంకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, భక్తుల జయ జయధ్వానాల మధ్య జగథానుడి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. అభిజిత్ లగ్నం శుభ ముహూర్తాన సీతారాముల వారి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.
NZBl ధర్‌పల్లి MRO కార్యాలయ ఆవరణలో నేడు ఉ.11 గంటలకు సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను బహిరంగ వేలం వేయనున్నట్లు ఆర్‌ఐ రాజేశ్వర్ తెలిపారు. ఇటీవల ఓన్నాజీపేట్, కొటాలపల్లి గ్రామాల్లో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.MRO శాంత ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించనున్నారు. నిబంధనల మేరకు అత్యధిక ధర పలికిన వారికి ఇసుకను కేటాయిస్తామన్నారు.
KMR: లింగాపూర్ గ్రామ శివారులోని చెరువులో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని మహిళ (35-40 ఏళ్లు) శవం లభ్యమైందని దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరైనా ఈ మహిళను గుర్తించినట్లయితే వెంటనే దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఆయన కోరారు. ప్రజలు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
WGL: ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాధర్నాను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ వరంగల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శనివారం పర్వతగిరి మండల కేంద్రంలో సీఐటీయూ మండల కన్వీనర్ జిల్లా రమేష్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం సరైంది కాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.
SRPT: ఐపీఎల్ ఫీవర్ అప్పుడే మొదలైపోయింది. తన అభిమాన జట్లయిన RCB, SRH లపై మక్కువతో సూర్యాపేట పట్టణానికి చెందిన ఓ యువకుడు వినూత్నంగా హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. మైదానంలో ఆటగాళ్లు సిద్ధమవుతుంటే, ఇటు అభిమానులు ఇలా తమ క్రేజ్‌ను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ BRS ఫ్లోర్ లీడర్‌గా 5వ వార్డు కౌన్సిలర్ చల్లా రమ్య-రఘురెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడాలని రాజయ్య ఈ సందర్భంగా నూతన ఫ్లోర్ లీడర్‌కు దిశానిర్దేశం చేశారు.