KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ 62వ వర్ధంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.