ADB: బేల మండలంలోని అవల్పూర్ గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భారతీయ జనతా పార్టీ మండల నాయకులు శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. నాయకులు తిరుపతి, రాకేష్, వెంకటరెడ్డి, వికాస్, శంకర్, సంతోష్, గిరిధర్, గ్రామ పెద్దలు, తదితరులున్నారు.