KMM: రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. వీలైనంత త్వరగా పైప్లైన్ పనులను పూర్తి చేసి రఘునాథపాలెం చెరువుకు నీళ్లు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, తదితరులున్నారు.