BPT: ఆర్థికంగా అత్యంత వెనుక బడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆయన పేదరిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.