NZB: ప్రస్తుత యాసంగి సీజన్లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువులకు డిమాండ్ పెరిగిందని వివరించారు.