ప్రకాశం: దర్శి పట్టణంలో ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరై అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంపాదనే ధ్యేయంగా ఉన్న ఈ కాలంలో ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ట్రస్ట్ వారికి అభినందనలు తెలపారు.