KMR: మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో మండల నాయకులు బట్ట వెంకట్రాములు, బట్టు నరేష్‌లు పాల్గొని నివాళి అర్పించారు. 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు ప్రాణ త్యాగాలకు సిద్ధ పడితే, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణకు పచ్చ జండా ఊపిందని అన్నారు. అమరవీరుల త్యాగాలను మరువద్దని వారు కోరారు.