ప్రకాశం: టంగుటూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే దామచర్ల శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ దంపతులు పట్టణంలోని మహిళా భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తదుపరి పూజారి వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు.