ప్రకాశం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళలను నిరాశపరిచిందని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. కొండేపి మండలం పెరిదేపిలో ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందుగా మహిళలకు అనేక వరాలు ప్రకటించడంతో మహిళలు పెద్ద ఎత్తున కూటమికి ఓట్లు వేశారని తెలిపారు. ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించకుండా ఆ పథకాలు ఎట్లా అమలు చేస్తారని ఆమె అన్నారు.