SRPT: హుజూర్నగర్ మండలం వేపలసింగారంలోని వ్యవసాయ గోడౌన్ను శనివారం జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి స్వర్ణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా అందజేయాలని సూచించారు.