KMR: పవిత్ర రంజాన్ మాసం ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. శనివారం నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. నెల వంక దర్శనంతో శనివారం రాత్రి నుంచి తరావీహ్ నమాజ్ ప్రారంభం కానున్నట్లు పిట్లం జామే మస్జిద్ ముఫ్తీ జంషేద్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సహార్ చేపడుతున్నట్టు తెలిపారు.