KMR: మహిళల మెడలో నుంచి బంగారు గుండ్లు చోరీ చేస్తున్న మహిళను శనివారం అరెస్ట్ చేసినట్లు బిచ్కుంద సీఐ జగడం నరేశ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. కర్నాటకలోని ఔరాద్ తాలూక కమల్నగర్కు చెందిన శాంతాబాయి మధుకర్ కాంబ్లే బిచ్కుంద బస్టాండ్లో చోరీలు చేస్తోంది. రద్దీగా ఉన్న బస్సుల్లో ఎక్కినట్లు నటించి మహిళల మెడలోని గుండ్లు చోరీ చేస్తోందని తెలిపారు.