సత్యసాయి: జిల్లా వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జనరల్ విద్యార్థులలో 11,843 మంది విద్యార్థులకు గానూ 11,460 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ రఘునాథ్ రెడ్డి తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులలో 1,580 మంది విద్యార్థులకు గానూ 1,484 మంది హాజరయ్యారన్నారు. 479 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.