మన్యం: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ డా బీ.ఆర్. అంబేడ్కర్ తనిఖీలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులు, హాజరుశాతంపై ఆరా తీశారు. వెలుగు లేకపోవడంపై విద్యుత్ ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ లకు సూచించారు. చూసి రాతలకు పాల్పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు.