ATP: అనంతపురంలోని ఎస్పీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌కు హిందూపురం పార్లమెంట్ సభ్యుల నిధుల నుండి రూ. 15 లక్షలు నిధులను కేటాయించారు. శనివారం భవన నిర్మాణానికి హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పాల్గొన్నారు.