సత్యసాయి: లేపాక్షి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో ఇవాళ మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు రోజున ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం అభిషేకం, అర్చనలు, వసంతోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమం భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.