ATP: గుత్తి పట్టణంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా డిప్యూటీ కలెక్టర్ తిప్పే నాయక్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ధర్మపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు సంబంధించి భూ సమస్యను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాలని అధికారులకు సూచించారు.