KMM: కొణిజర్ల నుంచి చింతకానికి వెళ్లే మార్గంలోని నేరేడు గ్రామ సమీపంలో ఉన్న పొలాల వద్ద శుక్రవారం కల్వర్టు ఒక్కసారిగా కూలిందని స్థానికులు తెలిపారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. కల్వర్టు శిథిలావస్థకు చేరడంతోనే కూలిందన్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరారు.
KMR: బిక్కనూర్ తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో TGT మ్యాథ్స్ సబ్జెక్టు బోధించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రఘు తెలిపారు. ఈనెల 30న ఉ.11గం.లకు భిక్కనూరు రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో నిర్వహించే డెమో ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. B.Ed, PG అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే స్వాత్రిక్ అనే 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలుడిని ఢీ కొట్టి ఆపకుండా లారీ డ్రైవర్ వెళ్ళాడు. వట్టేముల గ్రామంలో ప్రజలు పట్టుకున్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన బాలుడిగా స్థానికులు గుర్తించారు.
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28, 29 తేదీల్లో వారాంతపు సెలవులు కాగా, 30వ తేదీన అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈనెల 31 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని పేర్కొన్నారు.
JNG: తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి బచ్చన్నపేట మండలం అధ్యక్షునిగా ఆరేళ్ల భాస్కర్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొని, నియామక పత్రం అందజేశారు. తన నియామకానికి సేకరించినందుకు రాష్ట్ర అధ్యక్షునికి, జిల్లా నాయకులకు భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు. రజక కులస్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
WNP: ప్రజా పాలన దరఖాస్తులతో సంబంధం లేకుండా ప్రతి ఇంటిని సర్వేచేసి అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి చేకూర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టాంజనేయులు డిమాండ్ చేశారు. పట్టణ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం చేపట్టిన రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
MBNR: చిన్నారులు అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో ‘3వ పిల్లల మర్రి బాలోత్సవ కార్యక్రమం’ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, చిత్ర లేఖనం, ఆటలు, దేశభక్తి గీతాలు తదితర ప్రదర్శనలను సందర్శించారు.