MNCL: జన్నారం మండలంలోని అటవీ రేంజ్ బైసన్ కుంట ప్రాంతంలో పక్షి శాస్త్రవేత్తలు, అటవీశాఖ అధికారులు పక్షుల శబ్దాలను రికార్డింగ్ చేశారు. ఆదివారం ఉదయం వారు బైసన్ కుంట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న వివిధ పక్షుల శబ్దాలను ఆధునిక పరికరాల ద్వారా రికార్డు చేశారు. ఆధునిక పరికరాలు ఉపయోగించి పక్షుల శబ్దాలను రికార్డింగ్ చేయవచ్చన్నారు.