NLG: డిండి మండలం ఎర్రారంలో రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు ఎమ్మెల్యే బాలునాయక్ ఆదివారం “తోఫా” అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.