BDK: పినపాక మండలం జానంపేట గ్రామంలో ఈనెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే నాగులమ్మ జాతరకు ముఖ్యఅతిథిగా రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఆదివారం ఆలయ కమిటీ నిర్వహకులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. జాతర కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు ఉన్నారు.