KMR: దోమకొండ మండలం సంగమేశ్వర్ ఆరోగ్య ఉప కేంద్రాన్ని శనివారం ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రభావతి సందర్శించారు. చిన్నపిల్లలకు ఇస్తున్న టీకాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సంరక్షణకు వాడాల్సిన మందులు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.