GDWL: జిల్లా కోర్టు జడ్జి ఎన్. ప్రేమలత మహబూబ్ నగర్‌కు బదిలీపై వెళుతున్న సందర్భంగా సోమవారం కోర్టు ఆవరణలో సత్యాస్లా ప్రతినిధులు, న్యాయవాదులు ఆమెను ఘనంగా సన్మానించారు. గద్వాలలో ఆమె 8 నెలల కాలంలో న్యాయ వ్యవస్థకు కొత్త ఊపిరినిచ్చారని, ఆమె అందించిన సేవలను న్యాయవాదులు కొనియాడారు. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.