SRPT: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతిలేదన్నారు.