WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్లోకి 5 జాగిలాలు నూతనంగా వచ్చి చేరాయి. నేడు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో జాగిలాలను సీపీ అంబర్ కిషోర్జా పరిశీలించారు. నేరస్తులను పట్టుకోవడంలో జాగిలాల పాత్రను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా జాగిలాలకు శిక్షణ ఇస్తున్న సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు.