రంగారెడ్డి: అబాకస్ వేదిక్ మ్యాథ్స్ జాతీయ స్థాయి పోటీలలొ శంషాబాద్ మండలం పెద్ద షాపూర్‌లోని సర్దార్ వల్లబా భాయ్ పటేల్ హైస్కూల్ విద్యార్థి రవి తేజ పాల్గొని తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంగళవారం అభినందించారు. విద్యార్థి జాతీయ స్థాయి పోటీలో విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేసారు.