MNCL: తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీ 2026-27 ఏడాదికి గాను ఈనెల 28న వారసంత బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలు సంయుక్త ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రేచిని జెండా సర్కిల్ ఆవరణలో జరుగుంతందన్నారు. ఆసక్తి గల వారు మార్కెట్ వేలం డిపాజిట్ రూ. 5000 చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు.
PDPL: డ్రగ్స్ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మంథని ఎక్సైజ్ ఎస్సై సాయికుమార్ సూచించారు. ముత్తారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా ఉంటుందని హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, నిరంజన్ పాల్గొన్నారు.
NLG: వేసవిలో ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణంగా రోజుకు 15 మిలియన్ యూనిట్ల వాడకం ఉండగా, ఏప్రిల్, మే నెలల్లో ఇది 22 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేశారు. దీంతో లోడ్ తట్టుకునేందుకు సబ్జెస్టేషన్లలో అదనపు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు.
RR: శ్రీరామ నవమిని పురస్కరించుకొని కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వలో సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీతారామచంద్రస్వామి కృప కటాక్షాలు ప్రాంత ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరాజ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
WGL: నగరంలో ఒక రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో మోసం చేసి రూ.కోటి డబ్బు దోచుకున్నారు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా పరిచయం చేసుకుని, విడతల వారీగా డబ్బు జమ చేయించిన మోసగాళ్లు, చివరకు ఆదాయపన్ను పేరుతో అదనంగా డబ్బు అడగడంతో బాధితుడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
VKB: వికారాబాద్ 30వ వార్డులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య పాల్గొని చెత్తను వేర్వేరు డబ్బాల్లో వేసి సేకరణ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. వార్డు సమస్యలను పరిశీలించి త్వరిత పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ విజయలక్ష్మీ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
MHBD: ప్రముఖ టీవీ సీరియల్స్ దర్శకుడు రాజుమురారికి ఉగాది ప్రతిభాపురస్కారం లభించింది. మానుకోట జిల్లా సూదనపల్లి గ్రామానికి చెందిన రాజుమురారికి మానస ఆర్ట్స్ థియేటర్, GSR ఫ్రెండ్స్ ఈవెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఈ ఉగాది ప్రతిభా పురస్కారం అందజేశారు. తనకు ఈ పురస్కారం రావడం సంతోషంగా ఉందని మురారి తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా పౌర సరఫరాల శాఖలో గల ప్రభుత్వ వాహనం (నడపడానికి అనుకూలంగా లేని) టాటా సుమో వాహనాన్ని ఈనెల 30న బహిరంగ వేలం వేస్తున్నట్లు DSO నందిని తెలిపారు. ఆసక్తి గల వారు 30న మధ్యాహ్నం 3 గంటలకు అదనపు కలెక్టర్ రెవిన్యూ కార్యాలయంలో జరిగే వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.
HYD, RR, MDCL జిల్లాల పరిధి ప్రాంతాల్లో కరెంటు సమస్యల పై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు. 8712441912 నంబర్‌కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపితే సరిపోతుందని TGSPDCL తెలిపింది. బిల్లులు, మీటర్ సమస్యలు, విద్యుత్ సరఫరా అంతరాయం వంటి ఫిర్యాదులను ఈ నంబర్ ద్వారా స్వీకరించి త్వరగా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
BHNG: శ్రీరామనవమి సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా శ్రీరామనవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నవమి రోజున ప్రతి ఏటా వైభవోపేతంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారన్నారు. సీతారాముల పవిత్ర బంధం రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని ఆయన అన్నారు.
WGL: గ్రేటర్ వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలను ఇవాళ HNK జిల్లా కలెక్టర్ & బల్దియ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. ఈ నెల 31వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లలో ఎలాంటి అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
MLG: ఇంచర్లలోని గిరిజన గురుకుల ప్రతిభ కళాశాల (COE)లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC, BPC కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఝాన్సీ తెలిపారు. ఇటీవల పదవ తరగతి పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NZB: సిరికొండ మండలం కొండూరులో శ్రీరామ నవమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీతారామస్వామి శోభాయాత్రను గ్రామ పురవీధుల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హనుమాన్ మాలధారులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ‘జై శ్రీరామ్’ నినాదాలతో గ్రామాన్ని మార్మోగించారు. స్వామివారి పల్లకి సేవను గ్రామస్థులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో బలిపీఠం మహోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస చారి బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరిగింది. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.