ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ అలాం అధికారులతో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలన్నారు. ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.