PLD: పిడుగురాళ్లలో “ఆపరేషన్ సింధూర్” విజయం సందర్భంగా ఆదివారం తిరంగా యాత్ర నిర్వహించారు. R&B బంగ్లా నుంచి ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు జరిగిన ఈ యాత్రలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత త్రివిధ దళాలకు అభినందనలు తెలిపారు. అనంతరం మాజీ సైనికులు ఐతం నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లును సన్మానించారు.