SKLM: వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం తహసీల్దార్ గణపతిరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, బహిరంగా ప్రదేశాల్లో ఉండరాదన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెలకాపరులు, కార్మికులు సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలన్నారు. చెట్లుకింద, సెల్ టవర్ల కింద నిలిచోవద్దని చెప్పారు.