కృష్ణా: కుప్పంలో జరిగే గంగ జాతరకు వెళ్లే భక్తులకై విజయవాడ మీదుగా పలు రైళ్లకు కుప్పం స్టేషన్లో స్టాప్ ఇచ్చామని రైల్వే శాఖ తెలిపింది. రేపు నం.15228 ముజఫర్పూర్ – SMBVT బెంగుళూరు, నం. 12510 గౌహతి – SMBVT బెంగుళూరు, నం. 12890 SMBVT బెంగుళూరు- టాటానగర్ రైళ్లు, ఈ నెల 20న నం.18638 SMBVT బెంగుళూరు- హటియా రైలుకు కుప్పంలో తాత్కాలిక స్టాప్ ఇచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.