ప్రకాశం: ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కంభం సీఐ మల్లికార్జున అన్నారు. ఆదివారం సాయంత్రం కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజలకు సీఐ అవగాహన కల్పించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఉద్దేశపూర్వకంగా వాహనాలు అడ్డంగా పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారికి జరిమానా విధిస్తామని సీఐ తెలిపారు.