TG: ఫాల్కన్ కుంభకోణం కేసులో తెలంగాణ CID అధికారులు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. రబీంద్ర ప్రసాద్, సుష్మారాజ్ అనే ఇద్దరిని బిహార్‌లో అరెస్ట్ చేసి.. పీటీ వారెంట్‌పై వారిని HYD తీసుకొచ్చారు. ఇద్దరు నిందితుల్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ ఫాల్కన్ కుంభకోణంలో చురుగ్గా వ్యవహరించి.. అక్రమార్జన చేసినట్లు సీఐడీ గుర్తించింది.