BDK: వలస ఆదివాసీలు విద్యా, క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సుందరయ్య నగర్ వలస ఆదివాసీ గ్రామ యువకులకు ఎస్సై రాజ్ కుమార్తో కలిసి వాలీబాల్ కిట్లను అందజేశారు. యువత అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాల్లోకి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.