రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ 219/5 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఒక దశలో PBKS 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ సమయంలో వధేరా(70), అయ్యర్(30) కలిసి జట్టును ఆదుకున్నారు. చివర్లో శశాంక్(59*), ఒమర్జాయ్(21*) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో దేశ్‌పాండే 2 వికెట్లు తీయగా, మఫాకా, పరాగ్, మధ్వాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.