AP: రాజధాని అమరావతి రెండో విడత భూసమీకరణ కోసం పల్నాడు జిల్లా పెదకూరపాడులో గ్రామ సభలను నిర్వహించారు. అలాగే బలుసుపాడులో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే భాష్య ప్రవీణ్, ఆర్డీవో రమాకాంత్, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి రైతులు తెచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు సానుకూలత చూపినట్లు అధికారులు తెలిపారు.