SRD: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని సుందరయ్య భవన్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు గురువారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.