BPT: నిజాంపట్నం గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని బాపట్ల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సురేష్ గురువారం పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన బెంచీలను, వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ రాసుకునేందుకు వీలుగా అన్ని వసతులు కల్పించామని తెలిపారు.