కోనసీమ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా భద్రత, సాధికారతకు ప్రాధాన్యత ఇస్తున్నాయని జేసీ నిశాంతి అన్నారు. అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి పలు సూచనలు చేశారు.