ATP: ఈ నెల 14న నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠ పిలుపునిచ్చారు. గుత్తిలోని R&Bలో గురువారం జనసేన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.