SDPT: పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన చిన్నమైల్ అంజిరెడ్డిని గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సిద్దిపేటకు చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అంజిరెడ్డి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు భూరెడ్డి విభీషన్ రెడ్డి, అంజిరెడ్డిని తదితరులు పాల్గొన్నారు.