AP: గుంటూరు జిల్లాలోని నందివెలుగు ఫ్లైఓవర్ పెండింగ్ పనులకు కేంద్రం నిధులు కేటాయించింది. రూ. 36.91 కోట్ల మంజూరుకు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంగీకరించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లుగా ముందుకు కదలని నందివెలుగు పైవంతెన పనులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో పైవంతెనకు నిధులు వచ్చినట్లు టీడీపీ శ్రేణులు వెల్లడిస్తున్నారు.